ఆపిల్ లో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని పలు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.
అయితే చాలా మంది ఆపిల్ తో పాటు వాటి గింజలను కూడా తినేస్తుంటారు ఇలా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి
యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష సమ్మేళనం ఉంటుంది. వీటిని తిన్నా, నమిలిలా అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం.
ఈ గింజలు శరీరానికి ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. చిన్న మొత్తంలో సైనైడ్ శరీరానికి స్వల్పకాలిక తేలికపాటి నష్టాన్ని కలిగిస్తుంది.
పొరపాటున ఆపిల్ గింజలను తింటే తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం తదితర సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, స్ట్రోక్స్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లి మరణం కూడా సంభవించవచ్చు.
50-300 mg హైడ్రోజన్ సైనైడ్ ప్రాణాంతకం కావచ్చు. ఒక గ్రాము ఆపిల్ గింజలో 0.6 mg హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది. అంటే 80 నుంచి 500 గింజలు తింటే మనిషికి ప్రాణాపాయం తప్పదు.
అందుకే యాపిల్స్ తినడానికి, యాపిల్ జ్యూస్ తాగే ముందు వాటి విత్తనాలను తొలగించడం మంచిది