‘సీషెల్‌ సాండిల్స్‌’ అందం అమ్మాయిల్ని కట్టిపడేస్తున్నది.

ఫ్లాట్స్‌ నుంచి హీల్స్‌ దాకా రకరకాల చెప్పుల మీద అమరిన గవ్వలు పాదాలకు కొత్తలుక్‌ తెస్తున్నాయి.

గవ్వలు అష్టాచెమ్మా ఆడేందుకే కాదు.. అమ్మాయి పాదాలను అందంగా అలంకరించేందుకూ ఉపయోగపడతాయి అంటున్నారు నయా డిజైనర్లు.

స్ట్రాప్‌ శాండిల్స్‌, స్లెడ్స్‌, వెడ్జెస్‌, ఫ్లాట్స్‌.. ఇలా భిన్న రకాల పాదరక్షల మీద ఇవి కనువిందు చేస్తున్నాయి.

కొల్హాపురి, రాజస్థానీ మోడల్‌ చెప్పుల్లోనూ గవ్వలను జొప్పిస్తున్నారు.

గవ్వలకు తోడు రంగుల ఊలు, ముత్యాలు, బీడ్స్‌, గజ్జెలను జోడించి పాదుకలను అందంగా ముస్తాబు చేస్తున్నారు.

దారాలతో పాటు చెమ్కీ ఎంబ్రాయిడరీ చేసిన చెప్పులకు లయబద్ధంగా వేలాడుతూ గవ్వలు మెరుస్తున్నాయి.

ఫ్యాషన్‌ డ్రెస్‌లమీదికైనా, సంప్రదాయ దుస్తులమీదికైనా గవ్వల పాదరక్షలు వారెవ్వా అనిపిస్తున్నాయి.

చెప్పు ఏదైనా అందంగా కనిపించడమే ప్రధానం అంటున్నారు ట్రెండ్ ఫాలో అయ్యేవారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం