మోడీ ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు.

జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీల తర్వాత ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న నేతగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రధానిగా ఎంపికైన రికార్డు మోడీ పేరిటే ఉంది.

చిన్నతనంలో నరేంద్ర మోడీ భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్షతో ఉండేవారు.ఆర్థిక ఇబ్బందులతో ఆ కల సాకారం కాలేదు.

తన తండ్రికి సహాయంగా రైల్వేస్టేషన్లో టీ అమ్ముతున్నప్పుడు భారత్ -పాక్ యుద్ధంలో పాల్గొని స్టేషన్కు వచ్చిన సైనికులకు టీ అందించి మోడీ చాలా ఆనందించారట.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న పదమూడేళ్ల కాలంలోనూ దేశ ప్రధానిగా ఉన్న ఎనిమిదేళ్లలోనూ ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదట.

నరేంద్ర మోడీ పెద్దల బలవంతం మీద పెళ్లి చేసుకున్నా ఆ వివాహాన్ని తర్వాత తిరస్కరించారు.

ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఉన్న మోడీ దేశదిమ్మరిగా దేశంలో చాలా చోట్లకు ఒంటరిగా ప్రయాణించారు.

నిత్యం యోగా చేయడం శాకాహారం కవితలు పద్యాలు రాయడం చదవడం ఫొటోగ్రఫీ ఆయన హాబీలు.