10 డిసెంబర్ 2020న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ ఈ కొత్త భవనాన్ని డిజైన్ చేసింది.

లోక్ సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్‌లో 384 మంది సభ్యులు, లోక్ సభ హాల్‌లో 1,272 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది.

ఈ కొత్త భవనంలో విశాలమైన కాన్ స్టిట్యూషన్ హాల్, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, కేఫ్, డైనింగ్ ఏరియా, కమిటీ మీటింగ్ రూమ్స్, పెద్ద పార్కింగ్ ఏరియాతో పాటు వీఐపీ లాంజ్ ఉన్నాయి.

ఈ పార్లమెంటు భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. ఈ భవనానికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

మంత్రిమండలి ఉపయోగం కోసం సుమారు 92 గదులు కేటాయించారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు.

రూ.861.90 కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే బిడ్‌ను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. భవన ప్రధాన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్

కొత్త పార్లమెంటు భవనం స్వావలంబన భారత్ (స్వావలంబన భారత్) స్ఫూర్తికి చిహ్నం.

కొత్త భవనం త్రిభుజాకారంలో ఉండగా.. కొత్త భవనం విస్తీర్ణం 1200,64 చదరపు మీటర్లు.

దాదాపు మూడేళ్లలో పూర్తైన కొత్త పార్లమెంట్‌ భవనం పాత పార్లమెంటుకు అనేక విధాలుగా భిన్నంగా ఉంటుంది.

ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో అనేక సౌకర్యాలతో కూడి ఉంటుంది

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (ఆదివారం) (మే 28) జాతికి అంకితం చేశాారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం