తులసి ఆకులను తినడం వల్ల జలుబు, జ్వరం, శ్వాసకోస సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది

పుదీనా ఆకులు వంటలలో బాగా ఉపయోగిస్తారు. కండరాల నొప్పి, కడుపు నొప్పి, జ్వరం వంటి కొన్ని వ్యాధుల నుండి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఆకుకూరలలో ముఖ్యమైనది మెంతికూర. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బరువు పెరగవచ్చు, కాలేయ క్యాన్సర్ ను నివారిస్తుంది.

నిమ్మ ఆకులు నరాల సంబంధిత మరియు ఒత్తిడి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  శ్వాసకోశ వ్యాధులు, గొంతు ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటి కొన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బ్రహ్మి మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది చర్మ గాయాలను, మెదడు మరియు నాడీ వ్యవస్థ వంటి వ్యాధులను నయం చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.

బాసిల్ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటిని వంటలలో కూడా వాడుతారు. ఆకలిలేని వారికి ఈ ఆకులను తినడం వల్ల ఆకలికలుగుతుంది

అశ్వగంధ మొక్క వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు. నాడీ రక్షణ బాగా ప్రసిద్ధి చెందుతుంది. సంతానోత్పత్తికి  బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కలబంద వేడిమిని తగ్గిస్తుంది. ఈ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గాయాలు, వాపులు నయం చేస్తుంది. జీర్ణ సమస్యలకు, ఆకలికి, మలబద్ధకం   నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఓమ మొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య  ప్రయోజనాలున్నాయి. ఈ ఆకులను తినడం వల్ల శ్వాస జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం