ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా 28 మే ఆదివారం నాడు సీఎస్కే వర్సెస్ జీటీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది

స్టార్ స్పోర్ట్స్ రిపోర్టు ప్రకారం ఈ ఐపీఎల్ సీజన్‌లో విన్నర్ అయ్యే టీమ్ రూ. 20 కోట్లు ప్రైజ్‌మనీగా గెలుచుకుంటుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు

ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్‌ క్యాప్ అందిస్తారు. ఆరెంజ్ క్యాప్‌ అందుకునే ప్లేయర్ కు రూ. 15 లక్షలను ప్రైజ్ మనీగా ఇస్తారు.

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌ రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తారు.

మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ రూ. 7 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి పోయి నాల్గో స్థానంతో సరిపెట్టుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ కు రూ. 6.5 కోట్ల క్యాష్ రివార్డు ఇవ్వనున్నారు.

ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ 16 మ్యాచ్ లు ఆడి.. 851 పరుగులతో టాప్ లో ఉన్నాడు.

పర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ పేసర్ మహ్మద్‌ షమి 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో రషీద్‌ ఖాన్‌ (27), మోహిత్ శర్మ (24) ఉన్నారు.

అలాగే  ఈ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌,  అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్, సూపర్‌ స్ట్రైకర్ ఆఫ్‌ ది సీజన్‌, గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌ ప్లేయర్లకు కూడా ప్రైజ్ మనీలు ఉంటాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం