1927లో ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ ఏర్పాటైంది. 

రెండేళ్ల తర్వాత ఆ సంస్థే సినీ రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ‘అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్’ పేరున పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది.

ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని స్పూర్తిగా తీసుకుని ఈ ప్రతిమను రూపొందించారు గిబ్బన్.

బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ ప్రతిమను ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ తయారుచేశారు. రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టిన యోధుడు ఫిల్మ్ రీలుపై దర్జాగా నిలుచొని ఉన్నట్టు అది కనిపిస్తోంది.

13.5 అంగుళాల ఎత్తు.. సుమారు నాలుగు కేజీల బరువు ఉండే ఆస్కార్ ప్రతిమను కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ట బంగారం పూత పూశాడు.

1929లో తొలిసారి ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడకలో 270కి పైగా గెస్ట్‌లు హాజరయ్యారు. తొలి ఆస్కార్ అవార్డుల వేడుక కేవలం 15 నిమిషాల పాటు జరిగింది.

ఆస్కార్‌కు వెళ్లిన సినిమాలకు ముందుగా సుమారు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఓటు వేసి నామినేట్ చేస్తారు.

హాలీవుడ్ జర్నలిస్ట్ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్‌‌గా పేర్కొన్నాడు. అలా అప్పటి నుంచి ఆస్కార్ పేరు దీనికి స్ధిరపడిపోయింది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం