1981లో బిహార్లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది మరణించారు

1995లో ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళ్తున్న పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ కలిండ్ ఎక్స్ ప్రెస్ రైలును ఢీ కొన్న ఘటనలో 358 మంది మృతి చెందారు

1999లో అసోంలోని గైసోల్ వద్ద జరిగిన రెండు  ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో 290 మంది చనిపోయారు

1998లో కోల్ కతా వెళ్తున్న జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఖన్నా-లుథియానా సెక్షన్ లో పట్టాలు తప్పిన గోల్డెన్ టెంపుల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీ కొట్టడంతో 212మంది ప్రాణాలు కోల్పోయారు

2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 140 మంది వరకు చనిపోయారు

2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోవడంతో ఓ డెల్టా పాసింజర్ రైలు పట్టాలు తప్పి 114 మంది దుర్మరణం చెందారు

2010లో హౌరా నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీ కొట్టిన ఘటనలో 170 మంది దాకా చనిపోయారు.

2012 హంపి ఎక్స్ ప్రెస్ ప్రమాదం. హూబ్లీ- బెంగళూరు హంపి ఎక్స్ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా మంటలు చెలరేగడంతో చాలా మంది మృతిచెందారు

2016లో ఇండోర్ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్ ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదంలో 150 మందికిపైగా మరణించారు

2023 ఒడిశాలో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఈ దుర్ఘటనలో 233 మంది దుర్మరణం చెందారు. 900 మందికిపైగా గాయాలపాలయ్యారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం