బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. సిబిల్ బాగుంటేనే లోన్ తొందరగా అప్రూవ్ అవుతుంది.
సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా స్కోర్ ఉంటే రుణాలు తొందరగా పొందవచ్చు.
క్రెడిట్ కార్డులు, ఇతరత్రా బ్యాంకు ఈఎంఐలతో సిబిల్ స్కోర్‌కు సంబంధం ఉంటుంది. వాటి బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే దాని ప్రభావం సిబిల్‌పై పడుతుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంటుంది.
డబ్బులు లేని సమయంలో చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులను ఎగ్గొడతారు. అవసరమైతే తర్వాత నెలలో లేట్‌ఫీతో కట్టుకుందాంలే.. పైసల్ లేనప్పుడు ఏం చేస్తామని అనుకుంటారు.
క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే అదనపు భారం పడటం మాత్రమే కాదు.. క్రెడిట్ స్కోర్ కూడా భారీగా పడిపోతుంది.
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్క నెల ఆలస్యమైనా దాని ప్రభావం సిబిల్ స్కోర్‌పై దారుణంగా పడుతుంది.
క్రెడిట్ కార్డును ఎప్పుడూ కూడా గరిష్ట పరిమితి వరకు వాడకూడదు. దీనివల్ల కూడా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది.
ఒకవేళ ఎక్కువ మొత్తం డబ్బులు అవసరమైనప్పుడు కార్డ్ లిమిట్ పెంచుకునేందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకున్న సందర్భాల్లో బ్యాంకులు ఒక్కోసారి క్రెడిట్ బ్యూరోకు సమాచారం తెలియజేయవు. అలాంటప్పుడు కూడా సిబిల్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది