తేనె సర్వరోగ నివారిణి అని అంటారు. కానీ ఈ రోజుల్లో దొరికే కల్తీ తేనె తీసుకుంటే ఆరోగ్యం మాట ఏమో గానీ కొత్త కొత్త రోగాలు వస్తాయి.

కల్తీ జరిగిందా? లేదా? అన్న విషయాన్ని గమనించాలి. మరి కల్తీ తేనెను ఎలా గుర్తించాలా?

అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచాలి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె.

స్వచ్ఛమైన తేనెకు మండే స్వభావం ఉంటుంది. నాణ్యమైన తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది.

గ్లాస్ మంచి నీటిలో టేబుల్ స్పూన్ తేనె వేయాలి. చెంచాతో కలపకుండా గ్లాస్‌ను అటూ ఇటూ తిప్పుతూ కలపాలి.

స్వచ్ఛమైన తేనె అయితే నీటిలో కరగదు. ఒకవేళ తేనె నీటిలో కలిసిపోతే అది కల్తీది అని గుర్తించాలి.

బ్లాటింగ్ పేపర్‌కు కాస్త తేనె రాయాలి. పేపర్ తడిసిపోతే అది కల్తీ తేనెగా భావించాలి.

చేతి బొటనవేలిపై కొంచెం తేనె వేయండి. చేతికి అలాగే అతుక్కుపోతే అది నాణ్యమైన తేనె.

వేలి నిండా వ్యాపించి జారిపోతే అది కల్తీదని గుర్తించాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం