Horoscope Today

ఆదివారం  అక్టోబర్ 30 , 2022

మేష రాశి

ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా దైర్యంగా ఉంటారు.ఈ రోజు ఇంట్లోకి కావాలిసినవి కొనుగోలు చేయడం వలన  ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.   మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థిక సమస్యలు ఈరోజు తొలగిపోతాయి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ మీరు చేయాలకున్న పనులను చేస్తారు.   మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు.

వృషభ రాశి

ఈ రాశికి చెందిన వారు ఆర్థిక పరిస్థితులు  మెరుగుపడనున్నాయి.  మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి అలాగే ఈ రోజు  మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడుపుతారు.ఈ  రోజు  మీ భాగస్వామితో గడపడం వలన  ఎంత గొప్ప  అనుభూతి పొందనున్నారో మీకు తెలుస్తుంది. ఈరోజు మీకు మంచిగా  ఉండబోతోంది. ఈ రోజు మీరు మీ స్నేహితులతో   కలసి సినిమాకు వెళతారు.

మిథున రాశి

ఈ  రాశికి చెందిన వారికి  బాగా పరపతి ఉన్న వ్యక్తుల నుంచి  సపోర్ట్ మీకు పెద్ద ప్రోత్సాహం అవుతుంది.ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న  ఆస్తి వ్యవహారాలు తేలనున్నాయి. పెట్టుబడులు పెట్టె వారికి  లాభాలను తెచ్చి పెడతాయి.ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఖాళీ సమయాన్ని మీ పాత్ర మిత్రులకు కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని  చాలా  ప్రేమగా చూసుకుంటారు.

కర్కాటక రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ భాగస్వామితో మీ సమస్యలు గురించి చెప్పండి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని కేటాయిస్తారు.డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీకు డబ్బు విలువ తొందరలో తెలియనుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు చాలా  ఇబ్బంది పడతారు.

సింహ రాశి

ఈ రోజు మీరు  చేయాలనుకున్న పనులు అన్నీ పక్కన పెట్టి మీకొరకు మీకు  సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు,కానీ అక్కడ  విఫలము అవుతారు. ఈ రోజు మీ జీవితం   అద్భుతంగా మారబోతుంది.  దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ యొక్క ఇబ్బంది కర రోజులు ముగింపు దశకు చేరుకొని,  మీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారు.

కన్యా రాశి

మితిమీరి తినడం మాని, అధికబరువు రాకుండా  చూసుకొండి. మీరు సానుకూల దృక్పధంతో  ఈ రోజు మీ ఇంటి నుంచి  బయటకు వెళతారు.ఈ రోజు  మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం మీరు  చాలా బాధ పడతారు.   మీ కాల్ ని పొడిగించడం వలన  మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి ఏడిపిస్తారు.

తులా రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఈ రోజు ఒక శుభ వార్త వింటారు. మీ కోపాన్ని అదుపు చేసుకోండి. లేదంటే చాలా నష్ట పోవాలిసి వస్తుంది. అందరిని నమ్మకండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు మంచి వార్తను చెప్పనున్నారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీ పనిని   ప్రశాంతంగా  చేసుకుంటారు. అనుకోకుండా మీరు   క్రొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఆ పనిలో మీకు పేరుతో పాటు  ప్రశంసలు కూడా  రావచ్చు.మీకు డబ్బు విలువ తొందరలో తెలియనుంది. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

ధనస్సు రాశి

సోమవారం రాక మిమ్ములను కొన్ని  ఆర్ధిక సమస్యల  నుంచి  ఉపశమనము కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో  రొమాంటిక్ వైవాహిక జీవితంలో  మరో అందమైన మార్పును మీరు ఈ రోజు చూడబోతున్నారు. మీజీవితంలో ముఖ్యం కానీ వారి మాటలను మీరు పట్టించుకోవద్దు. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.

మకర రాశి

మీరు డబ్బుల విలువ తెలుసుకొని  పొదుపు చేయాలనే ఆలోచన చేస్తారు. ఈ రోజు నుంచి మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఈ రోజు  మీ భార్యకు ఇంటి పనులలో పనివత్తిడి తగ్గించడానికి మీరు సహాయం చేయండి. ఈ రోజు మీరు  తెలియని వారికి  సహాయం చేయడం వలన మీ విలువ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతున్నారు.

కుంభ రాశి

ఆరోగ్య  సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే  ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి ఒక  దేవత ? మీరు  నమ్మరా? ఐతే మీరే కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలుసుకోనున్నారు.

మీన రాశి

ఇతరులతో పంచుకోవడం వలన మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది.   ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడతారు. మీ జీవితంలోకి  ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు . నిర్ణయాలు మీ అంతటి మీరే తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీకు  నచ్చిన ఉద్యోగము రావాలంటే   మీరు మరింత కష్టపడి పని చేయాలిసి ఉంటుంది.  మీ జీవిత భాగస్వామితో మిమ్మలని చాలా సంతోష పెట్టనుంది.

మరిన్ని భక్తి  వార్తలకోసం 

సందర్శించండి