20వ దశాబ్దంలో అమెరికాలో పుట్టిందీ ఫాదర్స్ డే. వాషింగ్టన్ స్పోకేన్‌లోని సొనోరా స్మార్ట్ డాడ్ అనే యువతికి ఈ ఘనత దక్కుతుంది.

మదర్స్ డే జరుపుకుంటుండగా.. ఫాదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దని సొనోరా డిమాండ్ చేశారు.

కాలక్రమేణా ‘ఫాదర్స్ డే’ని నిర్వహించడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం 1910, జూన్ 19న మొదలైంది.

స్పోకేన్‌లో మొదలైన ఫాదర్స్ డే వేడుకలు ఏటా నిర్వహించుకోవడం అమెరికాలో పరిపాటిగా మారింది.

1972 వరకు ఈ వేడుకను ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్ నిక్సన్ దీనిని అధికారికం చేశారు.

జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా జరుపుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ రోజున జాతీయ సెలవును కూడా ప్రకటించారు.

అప్పటినుంచి అమెరికాలో ఏటా ఫాదర్స్ డేని అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత్‌లోనూ ఇదే రోజున జరుపుతారు.

నాన్నని సంతోష పరచడానికి, తండ్రిపై ఉన్న ప్రేమను చూపించుకోవడానికి ‘ఫాదర్స్ డే’ సరైన వేడుక.

ఫాదర్స్ డే వేడుకలకే పరిమితం కాదు. నాన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేసే పండుగ.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం