మహళలు గర్భం దాల్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఫిట్‌నెస్ అన్ని విషయాల్లో నిపుణుల సలహాలు పాటించాలి.
గర్భం దాల్చిన తొలి రోజుల్లో మహిళలకు వికారం, వాంతులు సహజమే. దాదాపు 60 నుంచి 70 శాతం మంది గర్భిణులకు ఇలా జరుగుతుంటుంది.
గర్భాశయం పెరుగుతున్నకొద్దీ జీర్ణాశయాన్ని కాస్త పైకి నెట్టుతుంది. అదే విధంగా గర్భస్థ దశలో జీర్ణ ప్రక్రియ కాస్త నెమ్మదిస్తుంది. దీంతో అజీర్ణం సమస్య తలెత్తుతుంది
శరీర అవయవ భాగాల్లో నీరు చేరడాన్ని ఎడెమాగా సూచిస్తాం. గర్భం దాల్చిన తొలి 3 నెలల్లో పాదాలు, కాళ్లలో నీరు చేరిన భావన కలుగుతుంది. చెమట కూడా పడుతుంది. వేసవిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
పిండం పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంటుంది. ఊపిరితిత్తులు ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. ఫలితంగా ఉఛ్వాసం, నిశ్వాసం కష్టమవుతాయి.
సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణుల్లో రక్తం ఎక్కువగా ఉంటుంది. 1-1.5 లీటర్ల రక్తం శరీరంలో అదనంగా ఉంటుంది. దీంతో కొంత మందికి వేడిగా, చెమట పట్టినట్లు అనిపిస్తుంటుంది.
తమ శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు గర్భిణులు భావిస్తుంటారు. ఇలా పెరగకుండా చూసుకోవడమే గర్భిణుల లక్ష్యం కావాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, నీటిని ఎక్కువగా తాగాలి.
గర్భిణులకు మోస్తరు వ్యాయామం చాలా మంచిది. వేసవిలో అయితే మరీ ముఖ్యంగా చేయాలని వైద్యులు, గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.
రాత్రి సమయంలో ఆలస్యంగా తినకూడదు. ముఖ్యంగా చాలా తక్కువగా తినాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. రోజుకు కనీసం 5 సార్లు తింటే గర్భిణులకు మంచిది.