వాల్ నట్స్ పోషకాల బాంఢాగారం. వీటిలో ఫైబర్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
వాల్ నట్స్ ను అలాగే కాకుండా నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఎండాకాలంలో భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి.