ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది.
టమాటా రంగు చూస్తేనే తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం నిగారిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది.
టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.