మటన్, చికెన్‌ కంటే కూడా అత్యధిక పోషకాలు కలిగి ఉన్న కూరగాయ బోడ కాకర కాయ.. దీనినే బొంత కాకర కాయలు అని కూడా అంటారు

శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. ఈ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.

ఈ ఓవల్ గ్రీన్ వెజిటేబుల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

కండరాలు బలోపేతానికి బోడకాకర కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ కూరగాయల రసం మొటిమలు, తామరను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

బోడ కాకర కాయలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ కూరగాయలను ఎక్కువగా తినటం వల్ల నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది.

ఈ కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బోడ కాకర కాయ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ బోడకాకర కాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయ తింటే త్వరగా ఆకలి వేయదు.

బోడ కాకర కాయను తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం