బాదాం పప్పును నానబెట్టి తినడం వల్ల న్యూట్రియెంట్స్ ను శరీరం శోషించుకుంటుంది
కాయధాన్యాలు, బీన్స్ వంటి ధాన్యాలను తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫైటేట్ అని పిలువబడే ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. ఫైటిక్ ఆమ్లాన్ని కొన్నిసార్లు యాంటీ-న్యూట్రియంట్ అని కూడా పిలుస్తారు.
నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల శరీరంలో ఇనుము పరిమాణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇందులోని ఫైబర్ కంటెంట్ పెరిగి మలబద్ధకం, పైల్స్ ఉన్న రోగులకు ఉపశమనం కలుగుతుంది.
అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కానీ వీటిలో టానిన్ సమ్మేళనం ఉంటుంది. అందుకే ఈ వీటిని నానబెట్టి తినండి.