ఆయుర్వేదం ప్రకారం.. వాననీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

‘అంతరీక్ష జలం అని కూడా పేర్కొనే వర్షపు నీటిని తాగాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది

వర్షపు నీటిని తాగే ప్రక్రియలో.. వర్షం పడిన గంట తర్వాత నీటిని సేకరించాలి.

తర్వాత చంద్రకాంతిలో రాత్రిపూట ఆ నీటిని అలానే వదిలేయాలి. అవసరం అనుకుంటే గిన్నెను సన్నని కాటన్ వస్త్రంతో కప్పి ఉంచవచ్చు. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి తాగాలి.

ఆయుర్వేదంలో వర్షపు నీరు అమృతం లాంటిదని డాక్టర్ రేఖ వివరించారు. ఇది శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, కంఫర్ట్‌ను అందిస్తుంది.

వాన నీరు తాగడ వల్ల అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది

సేకరించిన వర్షపు నీరు తాగడానికి అనుకూలంగా ఉందో లేదో టెస్ట్ చేయవచ్చు.

వాన నీటితో అన్నం వండి, దాన్ని శుభ్రమైన వెండి ప్లేట్‌లో ఉంచాలి. రైస్ మరీ మెత్తగా అవ్వడం లేదా రంగు మారడం గమనిస్తే.. ఆ నీరు తాగడానికి పనికిరాదు.

ఒకవేళ రంగు మారకుండా ఉంటే, వర్షపు నీరు వినియోగానికి సురక్షితంగా ఉన్నట్లు భావించాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం