సమ్మర్ వచ్చేసింది. ఈ సమయంలో పెరుగును తింటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

ఎండాకాలంలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది.

సమ్మర్ లో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అందుకే పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.

పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది

ఇక పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎముకల బలానికి ఎంతగానో పెరుగు ఉపయోగపడుతుంది

పెరుగులో విటమిన్ బి 12 ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతగానో పని చేస్తుంది.

ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి పెరుగు దోహదం చేస్తుంది.

పెరుగు చర్మానికి రక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం పొడిబారకుండా చేస్తుంది. తద్వారా చర్మం కాంతివంతంగా ఉంటుంది

వేసవిలో పెరుగు లేదా మజ్జిగ శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా రక్షిస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం