ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు బెల్లం నీరు వాడితే ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది
బెల్లం శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఉదయాన్నే బెల్లం నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
బెల్లంలో విటమిన్ సీ ఉంటుంది. దీనిని వేడి నీళ్లలో బెల్లం కలిపి తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.