అందమైన, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇందుకోసం నానా ప్రయత్నాలు చేస్తారు

నిజానికి కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మానికి అస్సలు మంచివి కావు. 

కొన్ని రకాల ఆహారాలను తింటే ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకున్నా అందంగా కనిపిస్తారు. చర్మ సమస్యలు కూడా పోతాయి. మరి అవేంటో తెలుసుకుందాం

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ తొలగించడానికి ఈ బీట్ రూట్ సహాయపడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది.

పెరుగు చర్మ సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల చర్మమే కాదు మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

దానిమ్మ పండ్లను తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పసుపు పాలు చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. సిన్క్ ట్యాన్ కూడా తొలగిస్తుంది.

మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే బచ్చలికూర మన చర్మంపై మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

కొవ్వు, వేయించిన ఆహారాలను తినకూడదు. అలాగే శీతల పానీయాలను రోజూ తాగకూడదు. ఎందుకంటే ఇవి చర్మ సమస్యలకు దారితీస్తాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం