పొట్టలో గ్యాస్ తెప్పించడంలో టాప్ ప్లేస్ బీన్స్‌దే. వీటిలో రాఫ్ఫినోస్ ఉంటుంది. ఇదో రకమైన షుగర్. దీన్ని మన శరీరం త్వరగా జీర్ణించుకోలేదు.

పాల ఉత్పత్తుల్లో లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. కొంతమందికి పాలు సరిగా జీర్ణం కావు. ఫలితంగా పొట్టలో గ్యాస్ పెరుగుతుంది.

తృణధాన్యాలైన గోధుమలు, ఓట్స్ వంటి వాటిలో ఫైబర్, రాఫ్ఫినోస్, పిండి పదార్థం ఉంటుంది. వీటిని పెద్ద పేగులోని బ్యాక్టీరియా తింటుంది. తద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.

సోడాలు, కూల్‌డ్రింక్స్‌లో గ్యాస్.. పొట్టలోకి వెళ్తుంది.

మొలకలు, బ్రకోలీ, క్యాబేజీ, అస్పరాగస్, కాలీఫ్లవర్.. వంటివి విపరీతంగా గ్యాస్ తెస్తాయి.

యాపిల్స్, పీచెస్, పియర్స్, ప్రూన్స్ వంటి వాటిలో సహజమైన షుగర్లైన ఆల్కహాల్, సోర్బిటాల్ ఉంటాయి. వీటిని బాడీ అరిగించే ప్రోసెస్లో తద్వారా పొట్టలో హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ గ్యాస్ పుడుతుంది

కూల్ డ్రింక్స్ లాగానే... హార్డ్ క్యాండీ తిన్నప్పుడు కూడా మీరు చాలా గాలిని మింగేస్తారు. చాలా క్యాండీస్‌లో తీపి కోసం సోర్బిటాల్ వాడుతారు. ఇది గ్యాస్ తెప్పిస్తుంది.

ఉల్లిపాయల్లో ఫ్రక్టోజ్ అనే సహజ షుగర్ ఉంటుంది. ఇది పెద్ద పేగుల్లోకి వెళ్లగానే బ్యాక్టీరియా దీన్ని ముక్కలు చేసి తినేస్తుంది. అప్పుడు గ్యాస్ పుడుతుంది.

చ్యూయింగ్ గమ్ తినేటప్పుడు.. మీరు దాలా గాలిని మింగేస్తారు. వీటిలోని సోర్బిటాల్, మన్నిటాల్, జిలిటాల్ లాంటి షుగర్ అంత త్వరగా అరగదు. తద్వారా గ్యాస్ ఏర్పడే ఛాన్స్ ఉంది

ప్రాసెస్ చేసిన పొట్టలో గ్యాస్ ఏర్పడడానికి దారితీస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం