వేసవికాలంలో కళ్ల రక్షణకు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి కళ్లను అనేక విధాలుగా కాపాడుతాయి

సన్ గ్లాసెస్ తో సూర్యుని నుంచి వచ్చే హానికారక యూవీ కిరణాలు, వేడి, ఎండ, దుమ్ము, ధూళి కళ్లలో పడకుండా ఉంటుంది

తీవ్రమైన ఎండల్లో కూడా ద్విచక్ర వాహనాన్ని నడపడం చాలా సులువుగా ఉంటుంది. కళ్లకు ఏ మాత్రం ఒత్తిడి పడదు.

వయసుకు తగినట్టుగా సన్ గ్లాసెస్ ను ఎంచుకోవాలి

రోడ్లపై దొరికే సాధారణ కళ్లజోళ్ల జోలికి పోవద్దు.

నాసిరకం వాటితో సూర్యుని కాంతి నుంచి వచ్చే కిరణాల ప్రభావంతో కంటికి మరింత హాని కలుగుతుంది. కళ్లు ఎర్రబారి మంట వస్తాయి.

కళ్లజోళ్ల ఫ్రేమ్, గ్లాసుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడాలి. నాణ్యత ముఖ్యం. మెటల్ తో చేసినవి తీసుకోకపోవడం మంచిది.

పాలి కార్బొనేట్ ఉన్న లెన్స్ లు చాలా సురక్షితం. ద్విచక్రవాహనంపై వెళ్లేవారు పోలరైజ్డ్ లెన్స్ ఉన్న అద్దాలు ఎంపిక చేసుకోవాలి

మిర్రర్ గ్లాస్ చాలా చల్లగా ఉండేలా చేస్తుంది. యాంటీ కోటింగ్ తో ఉండే గ్లాసులు రాత్రి పూట ప్రయాణించినా కంప్యూటర్ ముందు పనిచేసినా కళ్లకు ఇబ్బంది ఉండదు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం