నవ్వేటప్పుడు మన శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి బ్రెయిన్‌కి మంచి కెమికల్స్. ఇవి మన మూడ్‌ని ఆనందంగా మార్చుతాయి.

నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఒత్తిడికి కారణం ఈ హార్మోనే.

నవ్వే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వారికి తలనొప్పి ఇతరత్రా అనారోగ్య సమస్యలు అంత త్వరగా రావు. నవ్వే ఔషధంలా పనిచేస్తుంది.

నవ్వు అనేది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల.. నొప్పి తగ్గి.. ఉపశమనం కలుగుతుంది.

నవ్వడం వల్ల ఇతరులు మనకు దగ్గరవుతారు. నవ్వే ముఖం అందరికీ నచ్చుతుంది.

నవ్వు అనేది ఓ రకమైన పాజిటివ్ కమ్యూనికేషన్. నవ్వే వారి మధ్య మానవ సంబంధాలు బలపడతాయి.

నవ్వే ముఖాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. నవ్వుతూ ఉండే వారి దగ్గరకే ఎవరైనా వెళ్లేందుకు ఇష్టపడతారు.

నవ్వినా, పగలబడి నవ్వినా.. రక్తపోటు (బీపీ) తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. నవ్వేటప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది.

నవ్వుతూ ఉండేవారు బాగా పనిచేస్తారు. హుషారుగా ఉంటారు. తెలివిగా ఆలోచిస్తారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం