మన ఇంట్లో ఉండే పండ్లు కూరగాయలను తొక్కతీసి తింటుంటాం కానీ కానీ ఆ తొక్కను పడేయ్యకుండా బ్యూటీ కోసం వాడడం ఎలాగో తెలుసా
దోసకాయ తొక్క చర్మాన్ని మృదువుగా చేస్తుంది. వాపు సమస్య రాకుండా నివారిస్తుంది.దీన్ని ఫేస్ మాస్క్, టోనర్‌లా ఉపయోగించవచ్చు.
బంగాళాదుంప తొక్కలో విటమిన్ బి, సి, పొటాషియం ఉన్నాయి. ఇవి కళ్ల కింద నల్లటి చారలను తొలగిస్తాయి. చర్మం తేమగా మార్చుతుంది
దానిమ్మ తొక్క పొడిని ఫేస్ ప్యాక్ లాగా చర్మంపై రాసుకుంటే నేచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
కమలాపండు తొక్కులను పొడిగా చేసుకుని పేస్కి బాడీకి స్కబ్ లాగానూ నాచులర్ మాయిశ్చరైజర్ లాగానూ ఉపయోగించవచ్చు
మామిడి పండు తొక్కను ఎండలో ఆరబెట్టి పొడి చేసి దాన్ని పెరుగుతో కలిపి ముఖానికి పట్టించాలి. కొన్ని రోజులు అలా అప్లై చేస్తే ముఖంపై మచ్చలు తొలిగిపోతాయి
అరటి తొక్కలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, ఐరన్ మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
పచ్చి బొప్పాయి తొక్కను పొడిగా చేసుకొని ఫేస్‌కు అప్లై చేస్తే ముఖంలో ముడతలు, వృధ్యాప్య ప్రభావానికి చెక్ పెడుతుంది.