సమయానికి తినడం, సరైన ఆహారం తీసుకోవడం.. ఇవే మన ఆరోగ్యం ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తాయి.

వ్యాయామం, మంచి జీవనశైలి వంటివి ఆ తర్వాతే ఉంటాయి.

సాధారణంగా రోజులో బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనదని చెబుతారు. పొద్దున్నే తినే ఆహారం, మనకు కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది. అయితే చాలా మంది వ్యక్తులు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి పదార్థాలు తినాలనే విషయంపై దృష్టి పెట్టరు.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చెయ్యడం లేదా ఖాళీ కడుపుతో చాలా మంది వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయి

స్వీట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ తగ్గిన ఫీలింగ్‌, కార్బోహైడ్రేట్స్‌ క్రేవింగ్స్‌ను పెంచుతుంది. ఫలితంగా వెంటనే ఆకలి వేస్తుంది.

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు ఎక్కువగా తాగితే పొట్ట సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిని చాలా లిమిటెడ్‌గా తాగొచ్చు.

చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం మంచిది కాదు.

ఉదయం పూట ఒక బౌల్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా చాలా మంది భావిస్తారు. పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా, ఖాళీ కడుపుతో తినకూడదు

పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్‌ కోసం నట్స్‌, అవకాడో, నెయ్యి, సీడ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం