జపాన్లో పండించే డెన్సుకే పుచ్చకాయ ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు

జపాన్ లోని హొక్కాయిడో (Hokkaido) ప్రాంతంలో మాత్రమే ఈ పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పుచ్చకాయల్లో అత్యంత నాణ్యమైనవిగా వీటిని చెబుతారు.

డెన్సుకే అనేది.. డెన్, సుకే పదాల కలయిక. డెన్ అంటే.. విజయం అని అర్థం. సుకే అంటే ఎలక్ట్రిసిటీ అని అర్థం. ఈ పుచ్చకాయలను పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారని అర్థం.

సాధారణంగా తినేందుకు ఈ పుచ్చకాయలను కొనరు. ఎవరిగైనా గిఫ్టుగా ఇచ్చేందుకు కొంటారు.

ఈ పుచ్చకాయ ధర ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం నాణ్యమైన ఏ1 రకం పుచ్చకాయ ధర దాదాపు రూ.5లక్షలు

ఈ పుచ్చకాయల్ని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. అందువల్ల ప్రతీ పుచ్చకాయ బరువూ 6 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది.

డెన్సుకే పుచ్చకాయలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో గింజలు చాలా చిన్నగా ఉంటాయి. అది కూడా పూర్తిగా నల్లగా మారవు. పూర్తిగా పెరగవు. అందువల్ల ఈ పుచ్చకాయను గింజలతో సహా తినేయవచ్చు

హొక్కాయిడోలో వాతావరణం ప్రత్యేకమైనది. అక్కడి భూమి కూడా సారవంతమైనది. అందువల్ల అక్కడ మాత్రమే వీటిని పండిస్తున్నారు.

ఈ పుచ్చకాయలు ఎన్ని కావాలంటే అన్ని లభించవు. పండిన వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం