సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి తనలాంటి పాత్రలు మరెవరూ చేయలేరని ప్రూవ్ చేసిన నట సార్వభౌముడు.
కృష్ణుడు, రాముడు, ధుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు.. ఏ పౌరాణిక పాత్ర అయినా ఆయన తర్వాతే .. అన్నంతలా ఒదిగిపోయిన మహా నటుడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ మొత్తంగా 302 సినిమాల్లో నటించారు. అందులో 275 సినిమాలు హిట్స్ అయ్యాయి. 23 సినిమాలు సంవత్సరం పాటు రన్ అయ్యాయి.
ఎన్టీఆర్ చేసిన 302 చిత్రాల్లో 48 పౌరాణికాలు, 18 చారిత్రక చిత్రాలు ఉన్నాయి. వీటిలో 17 సార్లు కృష్ణుడిగా కనిపించారు. 32సార్లు డ్యూయెల్ పాత్రలను పోషించారు. 18 సినిమాలకు స్వీయ దర్శకత్వం వహించారు.
35 సంవత్సరాల సినీ జీవితంలో 95 మంది దర్శకులతో పనిచేశారు.
ఇక రాజకీయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారు.
పేదల దేవుడిగా అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన అన్నగారుగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు
ఆ మహాపురుషుని శతజయంతోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. యుగపురుషుడిని స్మరించుకుంటున్నారు తెలుగు ప్రజలు.