Prime9

Brianna Lafferty: 8 నిమిషాలు చనిపోయి తిరిగి బతికింది.. చావు తరువాత ఎలా ఉంటుందంటే..?

Brianna Lafferty dead for 8 minutes and woke up: జనన మరణాలు సృష్టిలో భాగం. కాని జన్మించిన ప్రతి ఒక్కరికి మృత్యుభయం వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. మరణం ఏ రూపంలో వస్తుందో.. ఎవరూ ఊహించలేరు. అలా అని మరణాన్ని ఎంతటివారైనా శాసించలేరు. కాని ప్రతిఒక్కరికి మరణం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇక మరణం తరువాత ఏం జరుగుతుంది.. ఆత్మ ఎక్కడికి వెళుతుంది.. పరలోకం ఏవిధంగా ఉంటుంది.. ఇలా అనేక విషయాలను తెలుసుకోవాలని మనిషి తపిస్తుంటాడు. కాని అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కేవలం మన పురాణాల ప్రకారం చనిపోయిన తరువాత దేహం నుంచి విడిపోయే ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని మాత్రమే మనకు తెలుసు. కానీ అమెరికాలో ఓ అద్భుతం జరిగింది. కొన్ని నిమిషాల పాటు చనిపోయన ఓ యువతి మరణానుభవాన్ని బయటి ప్రపంచానికి తెలిపడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి మరణాన్ని చూసి తిరిగి వచ్చిన మహిళ ఎవరు.. మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది ఆమె చెప్పింది.. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

 

అమెరికాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రియన్నా లాపెర్టీ అనే మహిళ అరుదైన మైయక్లోనుస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతుంది. దీంతో చికిత్స పొందుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఆమెలో చలనం లేకుండా పోయింది. ఆమె ఊపిరి ఆగిపోయింది. మెదడు పనిచేయడం మానేసింది. పల్స్ కూడా ఆగిపోయాయి. దీంతో ఆమె చనిపోయినట్టుగా వైద్యులు డిక్లేర్ చేశారు. కాని అనూహ్యంగా ఆమె ఓ 8 నిమిషాల తరువాత తిరిగి బతికింది. అయితే ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కాని ఆమె చనిపోయిన ఆ 8 నిమిషాలు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయడం ఇప్పుడు అందర్ని షాక్‭కు గురిచేస్తుంది.

 

మరణం అనేది ఓ బ్రాంతి అన్న బ్రియన్నా తన చావు విషయంలో అనుభవాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆత్మ ఎప్పటికీ చావదని.. మరణం తరువాత కూడా మనం స్పృహలోనే ఉంటామని చెప్పింది. మన ఆత్మ మాత్రమే వేరే చోటకు వెళుతుందన్నది. తన బౌతిక దేహం నుంచి తనను ఉన్నట్టుండి వేరు చేశారని.. తన గురించి తనకు గుర్తుకు లేదని.. కానీ తనలో లైఫ్ ఉన్నట్టు అనిపించిందని చెప్పింది. ఎక్కడో తేలుతున్నట్టు.. టైమ్ అనేది లేని చోట తాను ఉండిపోయినట్టు తన మరణానికి సంబంధింది ఆమె వివరించింది. మరణం తరువాత తనకు ఎలాంటి నొప్పిలేదని.. అంతా ప్రశాంతంగా ఉందని.. క్లియర్‭గా ఉందని చెప్పింది.

 

ఇక బ్రియన్నా చెబుతున్న మాటలతో పెద్ద చర్చే మొదలైంది. మనిషి చనిపోయిన తరువాత తిరిగి ఎలా వస్తారని.. అది ఎలా సాధ్యపడుతుందని చర్చించుకుంటున్నారు. అయితే బ్రియన్నా మైయక్లోనుస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఆమె న్యూరోలాజికల్ కండీషన్‭లోకి జారుకొని ఉండొచ్చని వైద్యుల భావిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా వైద్యులు బ్రియన్నా మరణాన్ని ధృవీకరించిన 8 నిమిషాల తరువాత ఆమె తిరిగి బతకడం, తన మరణ సమయంలో ఎదురైన అనుభవాలను వెల్లడించడం ఇప్పుడు ఓ పెద్ద మిరాకిల్‭గా ఉంది.

 

Exit mobile version
Skip to toolbar