Prime9

Rare Red Cobra Video: లైఫ్ లో ఒక్కసారే కనపడే రెడ్ కింగ్ కోబ్రా.. చాలా క్యూట్ గా ఉందంటూ పోస్టులు!

Rare Red Cobra Video: పామును చూడగానే అందరికీ భయం వేయడం సహజమే. అయితే పాములో చాలా రకాలు ఉంటాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి ఉండగా.. మరికొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. మన దేశంలో ఎక్కువగా విషపూరితమైన పాములు ఉన్నాయి. ఇందులో మనకు ఎక్కువగా కనిపించేవి విషమున్న పాములే. అయితే గత కొంతకాలంగా పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఎక్కువగా కింగ్ కోబ్రాకు సంబంధించినవే కనిపిస్తున్నాయి. తాజాగా, ఓ రెడ్ కలర్‌లో ఉన్న అరుదైన చిన్న కింగ్ కోబ్రా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ రెడ్ కలర్‌లో ఉన్న కింగ్ కోబ్రా చూడాడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనకుండా ఉండలేరంటే నమ్మరు మరి. ఇక, దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇలాంటి పాములను చూడడం చాలా అరుదు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఓ పాడుబడిన నివాసంలో ఈ రెడ్ కలర్ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే దానిని కెమెరాలో బంధించేందుకు ఆసక్తి చూపారు. రెడ్ కలర్‌లో పాము ఉందని తెలియగానే అందరూ వీడియోలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ పాము దగ్గరకు వెళ్లి దాటిని ఏకంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత దానిని కొట్టినట్లు చేశాడు. ఇంతలో ఆ పాము పగ విప్పి చూడడం మొదలుపట్టింది.

 

ఈ వీడియో చూస్తున్నంతసేపు భయం వేస్తోంది. ఎందుకంటే ఆ పాము విషపూరితమైనదా కాదా అనే విషయం తెలియదు. కలర్‌లో కనిపించే పాములలో ఎక్కువగా విషపూరతితమైనవే ఉంటాయి. మరోవైపు అలా పట్టుకోవడం చాలా డేంజర్ అంటూ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది అసలు రెడ్ కలర్‌లో కింగ్ కోబ్రాలు ఉండవని చెబుతున్నారు. కావాలనే ఆ పాముకు రెడ్ కలర్ వేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏదీ ఏమైనా ఆ యువకుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా పట్టుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

 

ఇప్పటివరకు ఎన్నో పాములను చూశాం. కానీ ఇలాంటి పాములు ఎప్పుడూ చూడలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే కింగ్ కోబ్రాలు ఎక్కు బంగారు రంగులో మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ కింగ్ కోబ్రా నిజమో కాదో తెలియదు. కానీ ఇలాంటి పాములను పట్టుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో జార్ఘండ్‌లో తీయగా.. @sujaysnakesaver అనే యూటూబర్ షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

 

#youtubeshorts #shorts red spectacle cobra in jharkhand

Exit mobile version
Skip to toolbar