Prime9

Head – Head Touch with King Cobra: కోబ్రా తలపై తల వాల్చి.. ఎందుకురా మనకి ఈ ఆటలు..?

Head – Head Touch with King Cobra: పాము ఎదురైతే చాలు గుండె హడలెత్తిపోతుంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తారు. నిజానికి పాముకు ఎదురేళ్ల సాహసం ఎవరు చేయలేరు. అదే కింగ్‌ కోబ్రా అయితే.. వెన్నులో వణుకు పుడుతుంది. అది కనిపిస్తే చాలు క్షణాల్లో కిలో మీటర్ల దూరం పరుగులు పెడుతాం. కానీ, కొందరు మాత్రం పాములు కలిపిస్తే వారిలో ఒకరకమైన ఉత్సాహం కనిపిస్తుంది. వాటిని పట్టుకుని ఆటలు ఆడేందుకు తెగ ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్య ఇలాంటి ఎన్నో వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి చూసి జనాలు అంత షాక్‌ అవుతుంటారు. అసలు వారిలో అంత ధైర్యం ఎలా వస్తుందని, విషపూరితమైన పాములతో ఆటలు ఏలా అడగలరనే ఆశ్చర్యం కలిగిస్తాయి.

 

పాములను పట్టుకోవడమే కాదు. వాటితో పిల్లలాట ఆడుతుంటారు. ఈ క్రమంలో పాము కాటుకు గురై మరణించినవారు కూడా ఉన్నారు. అయితే కొందరం మాత్రం చాకచక్యం పాములను మచ్చిక చేసుకుని తమ ఆధీనంలో తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తి భారీ గిరినాగుతో చిన్నపిల్లలాట ఆడాడు. అంతేకాదు పామును గారాబం చేస్తూ దగ్గరికి తీసుకున్నాడు. అదేదో చిన్న నాగుపాము కాదండోయ్‌. 14 అడుగుల కింగ్‌ కోబ్రా. ఈ భారీ గిరినాగు తనకు ఎదురపడగానే.. భయంతో పారిపోవాల్సిందిపోయి.. దానికి ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు. అది బుసలు కొడుతున్న ఏమాత్రం భయపడకుండ దానికి ముఖంలో ముఖం పెట్టి కూర్చుకున్నాడు.

 

ఆ కోబ్రా పడగ విప్పి అతడినే చూస్తూ ఉంది. అతడు ఆ పాము తనపై చేయి పెట్టడానికి వెళుతుంటే.. అది కాటేసేందుకు నోరు తెరుచుకుని చూస్తోంది. అయినా అతడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పాము తలని నిమిరాడు. ఆ తర్వాత దానికి మరింత సమీపం వెళ్లి.. దాని తలపై అతడి తలను ఆనిచ్చాడు. ఆ పాము కూడా అతడి తీరు చూసి అలానే సైలెంట్‌గా ఉంది. ఇక అతడు తన తలని పూర్తి కింగ్‌ కోబ్రా తలకు ఆణించి కాసేపు అలాగే ఉన్నాడు. కొన్ని క్షణాల పాటు కోబ్రా తలపై, తన తలను పెట్టి చూస్తున్నారు. ఈ భయంకరైన విష సర్పంతో చిన్న పిల్లలా గారాబాలు పోయాడు. ఆ పాము కూడా అతడితో అలాగే గారాబాలు పోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఇక వ్యక్తిని ధైర్యానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు పామును వెనక నుంచి దాని తలను ముద్దాడిన వాళ్లను చూశాం.

 

అలాగే స్నేక్‌ క్యాచర్‌ స్టిక్‌తో పామును పట్టుకుని ఆటలు ఆడిన వాళ్లను చూశాం. కానీ, ఇక్కడ తన చేతిలో ఎలాంటి కర్ర, క్యాచర్‌ స్టిక్‌ లేదు. ఎలాంటి రక్షణ లేకుండ నేరుగా వెళ్లి పాము ముందు కుర్చున్న అతడి ధైర్యానికి నెటిజన్స్ షాక్‌ అవుతున్నారు. నిజంగా అలా పాము ముందు ఏ భయం లేకుండ కూర్చోవాలంటే ఎంతో ధైర్యం కావాలని, అతడి కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్‌ అంటున్నారు. ఆ పాము కూడా అతడి ఏం అనకుండ సైలెంట్‌ చూస్తూ ఉండిపోయింది. దీనిపై పలువురు చమత్కారిస్తున్నారు. ‘ఆపామును ఏం మాయ చేశావు బ్రో.. నీతో అంత చనువుగా ఉంటోంది’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరైతే.. ప్రభాస్‌ మిర్చి మూవీలోని డైలాగ్‌తో ఆ వ్యక్తిని పొగిడేస్తున్నారు. ‘ఏం గుండెరా అది.. కింగ్‌ కోబ్రాకే ఎదురేళ్లాడు.. ఆ గుండె బతకాలి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాతో తెగ వైరల్‌ అవుతుంది.

 

Exit mobile version
Skip to toolbar