Site icon Prime9

Thirsty King Cobra: బాబోయ్.. ఇలా చేయటం ఎవ్వడి వల్ల కాదు.. 15 అడుగుల కింగ్‌ కోబ్రా దాహం తీర్చిన వ్యక్తి..!

Man Feeds with Water to 15 Feet Thirsty King Cobra: ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచనలుమూలలో ఏం జరుగుతుందనేది క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా అది సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అవ్వాల్సిందే. అంతగా ప్రజలు సామాజిక మధ్యమాలకు అలవాటుపడిపోయారు. ఇందులో తమకు నచ్చని కంటెంట్‌, వీడియోలు చూస్తూ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఇందులో ఎక్కువగా ఆసక్తి ఇచ్చేది మాత్రం రీల్స్‌, ట్రెండింగ్‌ వీడియోలు. ఈ క్రమంలో మాముల వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

 

విషసర్పాలను నేరుగా చూసి భయపడే జనాలు సోషల్‌ మీడియాల్లో వాటిని చూసేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నిజానికి పాములు విషసర్పాలైనప్పటికీ అవి పెద్దగా హాని చేయవు. వాటికి ప్రమాదమని అని భావిస్తే తప్ప కాటు వేయవు. ఇక పాములకు వాటి తోకలు తొక్కితే విపరీతమైన కోపం.. అందుకే వెంటనే కాటు వేస్తాయి. అయితే ఈ మధ్య ఎక్కడ చూసిన పాములు పట్టే వీడియో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

 

పాములతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి వాటికి ఓ భాష ఉంటుంది. అలా స్నేక్‌ క్యాచర్స్‌ పాములను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు అవి వారి మాట విని బుసలు కొట్టకుండా సైలెంట్‌గా తొక మూడుచుకుని వెళ్లిపోతాయి.  ఇదిలా ఉంటే పాముల్లో అత్యంత భయంకరమైనవి కొండనాగులు. వీటినే కింగ్‌ కోబ్రా అని కూడా అంటారు. సాధారణంగా నాగులను చూస్తేనే హడలేత్తే జనాలు ఇక కింగ్‌ కోబ్రాను చూస్తే ప్రాణభయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం కింగ్‌ కోబ్రాను చూసి ఏమాత్రం బెనకలేదు. సుమారు 15 అడుగుల పోడవు ఉన్న కింగ్‌ కోబ్రా వేసవి కాలంలో వేడిని తట్టుకోలేక ఓ ఇంట్లోకి వచ్చింది.

 

దాహంగా అనిపించి నీరు వెతుక్కుంటూ అడవిలో నుంచి ఆ ఇంటిలోపలికి వచ్చింది.అక్కడ నీళ్లు పడుతున్న వ్యక్తి దగ్గరకి వెళ్లి ఆగింది. అయితే దాన్ని చూసి అతడు ఏమాత్రం బెనకలేదు. పైగా బకెట్‌తో ఆ కింగ్‌ కోబ్రాకు నీళ్లు తాగించాడు. ఆ తర్వాత దానికి తల నిమిరాడు. అతలా చేస్తుంటే ఆ పాము ఉరికే చూస్తూ ఉండిపోయింది. అయినప్పటికీ ఆ పాము అక్కడే ఉండటంతో అతడు మరోసారి దానికి నీళ్లు తాగించాడు. పాత వీడియో అయినప్పటికీ ఇది మరోసారి వైరల్‌ అవుతోంది. ఎండకాలం వస్తున్న నేపథ్యంలో మూగ జీవాల కోసం నీరు ఉంచాలనే సందేశం ఇస్తూ ఈ వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

 

 

King Cobra Very Big Size 🐍🙄😳😲🧐🐍👍

 

Exit mobile version
Skip to toolbar