Prime9

Tiger Attack Video: పులితో ఫోటో రిస్క్ అయినా తప్పులేదు.. చనువిచ్చింది కదా అని ఆడుకుంటే!

Tiger attack Indian Man In Thailand Video Viral: యమదొంగ సినిమాలో ఎంట్రీ సీన్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ డైలాగ్‌కు అనుగుణంగానే ఓ వ్యక్తి చేసిన పనికి సరిగ్గా సరిపోతుంది. ఇండియాకు చెందిన ఓ వ్యక్తి పులితో ఫోటో దిగడంతో పాటు ఆడుకునేందుకు ప్రయత్నించగా అటాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

సాధారణంగా, పులిని చూస్తే ఎవరైనా భయపడుతారు. కొంతమందికి పులి కనిపించగానే ఏకంగా గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అయితే మరికొంతమంది పులితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించి ఇరకాటంలో పడుతారు. ఏకంగా పులితో ఆటలు ఆడేందుకు ప్రయత్నించి ఆస్పత్రులకు పాలవుతుంటారు. ఫేమస్ అయ్యేందుకు పులులతో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు.

 

తాజాగా, థాయ్‌లాండ్ దేశంలో ఓఇండియన్ టూరిస్ట్ పులితో ఫోటో దిగేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. ఈ వీడియోలో తొలుత ఆ టూరిస్ట్ పులిని చైన్ సహాయంతో పట్టుకొని నడుస్తూ వస్తుంటాడు. ఆ తర్వాత కొంతదూరం వచ్చిన తర్వాత పులి ఆగేసరికి.. ఆ టూరిస్ట్ కూర్చొని దాని మీద చేయి వేసి ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు.

 

అయితే, ఈ సమయంలో ఆ గైడ్ ఓ రాడ్ సహాయంతో పులిని అలర్ట్ చేశాడు.దీంతో పులికి ఇరిటేట్ వచ్చి ఆ టూరిస్ట్‌పై మీద పడింది. వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఆ టూరిస్ట్ గాయపడినట్లు చెబుతున్నారు. ఈ వీడియో కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

ఈ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పులుల నడుము కొంచెం కిందిభాగంలో టచ్ చేస్తే వాటికి నచ్చదని కామెంట్స్ చేస్తున్నారు. పులిపై నడుము మీద చేయి వేస్తే దానికి కోపం వచ్చి ఉంటుందని నెటిజన్ కేడీ మంగలే అన్నాడు.

 

 

Exit mobile version
Skip to toolbar