Prime9

Kissing King Cobra Video: బ్రో దేనికైనా ఒక హద్దు ఉంటది! పొడవైన కింగ్ కోబ్రా తలపై ముద్దులా?

Young Man dare to kiss on King Cobra’s Head: కింగ్ కోబ్రా కనిపిస్తే ఎవరికైనా వణుకే. అలాంటిది ఏకంగా కొంతమంది కింగ్ కోబ్రాలతో ఫన్నీ గేమ్స్ ఆడడంతో పాటు వాటికి ముద్దులు ఇచ్చేస్తుంటారు. కనీసం ఆ కింగ్ కోబ్రా విషమైనదా? కాదా? అని తెలియకుండానే సాహసాలు చేస్తున్నారు. ఓ యువకుడు భారీ కింగ్ కోబ్రా తలపై ముద్దులు పెట్టాడు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. అరేయ్.. కింగ్ కోబ్రాకు ఏం చెప్పావ్ రా? అలా ఎలా ముద్దులు పెట్టావ్ రా? అని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరితమైందని అని చెబుతారు. ఈ కింగ్ కోబ్రా విషం ఒకసారి వదిలితే 20 మంది చనిపోయేంత ఉంటుందని చెబుతారు. అయినప్పటికీ కొంతమంది ఏకంగా కింగ్ కోబ్రాలతో చెలగాటం ఆడేందుకు సైతం వెనకాడడం లేదు. ఏకంగా కింగ్ కోబ్రాకే ముద్దులు పెట్టే వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియోలో కింగ్ కోబ్రా పడగపైనే ముద్దు పెట్టుకొని కాసేపు అలానే రొమాన్స్ చేశాడు.

 

అయితే, ఆ యువకుడు ముద్దు పెట్టినా కింగ్ కోబ్రా ఏం అనడం లేదు. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొన్ని సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌లో కింగ్ కోబ్రా తలపై వెనుక నుంచి ఆ యువకుడు ముద్దాడ్డాడు. ఇలా కొంతమంది ఈ ప్రమాదకరమైన వాటితో చెలగాటం ఆడటానికి వెనుకాడరు. దీనిని చూసిన నెటిజన్లు నాగుపాము మిమ్మల్ని తిరిగి ముద్దు పెట్టుకునే వరకు ఫర్వాలేదని కామెంట్స్ చేశారు. బ్రో ఇది నిజంగా నమ్మశక్యం కానిదని, చాలా ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు.

 

కాగా, పాముల మెదడులో ప్రేమను అనుభవించే భాగం ఉండదని మరొక్కరు కామెంట్స్ చేశారు. పాముతో రొమాన్స్ వ్యక్తిగతమని, అవి ఇప్పటికీ అద్భుతంగా ఉంటాయన్నారు. రెచ్చగొడితే తప్ప తమ ప్రతాపం చూపవని అంటున్నారు. ఈ వీడియోను @NickTheWrangler_TV యూట్యూబర్‌లో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. అయితే కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో అది ఆ యువకుడిని కరిచేందుకు ప్రయత్నించింది.  ఇలాంటి కింగ్ కోబ్రాలతో జాగ్రత్తగా ఉండాలని పలువురు చెబుతున్నారు.

 

KING COBRA Kisses At The Lake!

 

Exit mobile version
Skip to toolbar