Prime9

Swimming with King Cobra: అరేయ్ ఎవర్రా మీరంతా..? 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాతో స్విమ్మింగ్?

Man Swimming with 12 Feet King Cobra in River: పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ముఖ్యంగా కొంత మంది అయితే పాములను చూస్తే హడలెత్తిపోతారు.. కొంత మంది అయితే వాటి వల్ల కలిగే భయానికి రాత్రుళ్లు నిద్ర కూడా పోరు. కొందరి విషయానికి వస్తే.. పాములంటే భయం ఉన్నప్పటికీ భయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంకొందరు పాములకు అస్సలు భయపడరు.

 

ఇక చాలా పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని విషపూరితమైతే మరికొన్ని విష రహితంగా ఉంటాయి.. పాములలో చాలా రకాలు ఉన్నప్పటీకి కొన్ని పాములు కాటేసిన కాసేపటికే చనిపోతారు. కొన్ని అయితే అసలు మనుషులకు ఎలాంటి హాని చేయవు. ఏదైనా హాని కాలిగిస్తాయనే భయంతో తప్పితే అవి అసలు ఎవరి పైన దాడి చేయవు.

 

కొన్ని పాముల కాటేస్తే.. కొంత సమయం తరువాత చనిపోతారు, ఎందుకంటే పాము విషం ఒళ్లంతా పాకి, అన్నీ శరీర అవయవాలు ప్రభావితమై చనిపోటానికి కొంత సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలో మనం వైద్య చికిత్స అందిస్తే.. ప్రాణపయ స్థితి నుండి భయటపడవచ్చు. కానీ కొన్ని పాములు కాటేసిన మరు క్షణంలో ప్రాణాలు పోతాయి. వాటిల్లో కింగ్ కోబ్రా ఒకటి.

 

ఇపుడు ఈ సోది అంతా ఎందుకు అనే కదా మీ ఆలోచనా.. నిజానికి నేను యూట్యూబ్ లో సాధారణంగా వీడియో చూస్తున్న క్రమంలో ఒక వీడియో తారసపడింది. అది చూసిన వెంటనే నా గుండె జారి ప్యాంట్ లోకి వచ్చేంత పనయ్యింది. ఎందుకంటే పాములు అంటే భయపడే వ్యక్తుల్లో నేను ఒకడిని కాబట్టి. నిజానికి ఎదురుగా పాములు ఉంటే చూసి భయపడతాను కానీ.. ఈ వీడియో చూశాక ఫోన్ లో పాములు చూడటానికి కూడా భయపడి చచ్చా..

 

అంతలా ఏం ఉంది అనే కాదా మీ ఆలోచన.. పదండి ఆ వీడియో గురించి చెప్తాను.. చూడటానికి ఆ వీడియో సాధారణంగా అనిపించవచ్చు.. కానీ నాకు మాత్రం పిచ్చ భయం వేసింది. ఆ వీడియోలో ఒక పెద్ద సైజ్ కింగ్ కోబ్రా.. ఒక 12 అడుగుల పైనే ఉండవచ్చు. అది నీటిలో స్విమ్ చేస్తుంది.. పక్కన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.. పోనీ అది అతనికి కనపడట్లేదా అంటే అలా కూడా కాదు దాన్ని పట్టుకున్నాడు కూడా.. అతను పట్టుకున్న కూడా నీటిలో ఉన్న కారణంగా కింగ్ కోబ్రా కి స్పర్శ తగాల లేదేమో అనుకున్న.. కానీ పట్టుకున్న ఒక 3 సెకన్లకే వెనక్కి తిరిగి అతడి వైపు ఆ పాము వెళ్తుంటే.. ఎక్కడ కాటేస్తుందేమో అని భయపడ్డాను. ఈ వీడియో ఎక్కడితో కానీ వైల్డ్ చార్లెస్ అనే యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు.

 

అంతేకాకుండా.. కాసేపు ఆ పామును పట్టుకొని దాని గురించి వివరణ ఇచ్చాడు. మీరుకూడ ఒకసారి వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. కానీ నాకు మాత్రం..

 

సాధారణంగా నేను స్విమ్మింగ్ చేస్తే ఫ్రెండ్స్ లేదా పిల్లలతో చేస్తాం. వీడు ఏంట్రా బాబు కింగ్ కోబ్రాతో స్విమ్మింగ్ ఏంట్రా బాబు.. ఇదేం ఇదేం ఆనందం రా అయ్యా అనిపించింది.

Swimming with a Giant King Cobra!

Exit mobile version
Skip to toolbar