Site icon Prime9

King Cobra Free in Forest: బాప్రే.. ఏంటన్న అది..? 20 అడుగుల కింగ్ కోబ్రాను సంచిలో పట్టుకొని.. చూస్తే షాక్

20Foot Long King Cobra Snake Released In Forest

20Foot Long King Cobra Snake Released In Forest

20 Foot King Cobra Snake free in Forest: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాములు పట్టేవారికి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆ భారీ పాములను చూసేందుకే భయం వేస్తుండగా.. అలాంటి భయంకరమైన పాములను పట్టేందుకు కొంతమంది ధైర్యం చేసి పట్టుకొని వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే. తాజాగా, ఓ భయంకరమైన కింగ్ కోబ్రా జనాల్లోకి వచ్చింది. దీంతో ఓ వ్యక్తి పట్టుకుని సంచిలో తీసుకొచ్చి అమాంతం అలా అడవిలో వదిలేశాడు. వాస్తవానికి అతని ధైర్యానికి హాట్సఫ్ చెప్పాలి.

 

కాగా, ఆ కింగ్ కోబ్రా 20 అడుగుల పొడవుగా ఉంది. అలాంటి కింగ్ కోబ్రాను రక్షించడంతోపాటు అడవిలోకి వదిలేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో సరైన వివరాలు తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్..వామ్మో ఇంత పెద్ద కింగ్ కోబ్రాను జీవితంలో చూడలేదు అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఇలా కామెంట్ పెట్టాడు. జాగ్రత్త బ్రదర్.. కింగ్ కోబ్రాలు అన్ని మంచివి కావు. కొన్ని భయంకరంగా అటాక్ చేస్తాయన్నాడు. ఈ కింగ్ కోబ్రా చాలా అందంగా ఉందని, అతడే నిజమైన కింగ్ ఆఫ్ కింగ్ కోబ్రా అంటూ కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను @RelaxLifeVIP యూట్యూబర్ షేర్ చేశారు.

 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆకర్షితులయ్యారు. వావ్.. భలే పట్టుకున్నాడు కింగ్ కోబ్రాను అని తెగ షఏర్ చేయడంతోపాటు లైక్స్ కొడుతున్నారు. ఈ కింగ్ కోబ్రాను ప్రజల నుంచి కాపాడిన అతడికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది అత్యంత అద్భుతమైన కింగ్ కోబ్రా.. అని మరో యూజర్ అంటున్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కింగ్ కోబ్రాను భలే పట్టేశాడు అని, దానిని అడవిలోకి వదిలేసి మంచి పని చేశాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 

నేషనల్ జియోగ్రాఫిక్ వివరాల ప్రకారం.. కింగ్ కోబ్రాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా పొడవు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ కింగ్ కోబ్రాలు నిట్టారువుగా నిలబడి శబ్ధాలు వినిపించేలా చేస్తాయని చెబుతుంటారు. ఒకవేళ ఇది కాటు వేస్తే.. కింగ్ కోబ్రా శరీరం నుంచి విడుదలయ్యే న్యూరోటాక్సిన్ ప్రభావంతో దాదాపు 20మందికిపైగా చంపడానికి సరిపోతుందని నేషనల్ జియోగ్రాఫిక్ చెబుతోంది.

 

Releasing large king cobra into the wild #kingcobra #amazing #shorts

 

 

Exit mobile version
Skip to toolbar