Breaking News

రోడ్లు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్..వైరల్ అవుతున్న స్టోరీ..!

20 th Jan 2021, UTC

పూణే :సోమవారం సాయంత్రం పూణేలోని తిలక్ రోడ్‌లో ఓ చిన్న ఆక్సిడెంట్ జరిగింది. దీనితో, అక్కడ ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం కలిగింది. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు అసౌకర్యాన్ని నివారించడానికి, అక్కడి మహిళా కానిస్టేబుల్ రహదారిని శుభ్రం చేయడానికి చొరవ తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అమల్దార్ రజియా సయ్యద్ రోడ్డును ఊడుస్తూ శుభ్రం చేసారు. ఇది కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో పాపులర్ అవుతోంది. 

తిలక్ రోడ్‌లో సోమవారం జరిగిన ప్రమాదం తరువాత లేడీ కానిస్టేబుల్ మోటారుసైకిల్ గ్లాస్, ఫైబర్ ముక్కలను శుభ్రంగా ఊడ్చి పక్కన పడేసారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ మైక్రో బ్లాగింగ్ ఆప్ ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసారు. పౌరులకు అసౌకర్యాన్ని నివారించడానికి, మహిళా పోలీసులు అమల్దార్ రజియా సయ్యద్ చొరవ తీసుకున్నారు మరియు చిన్న ప్రమాదం కారణంగా రహదారిపై పడిపోయిన గాజు ముక్కలను చీపురు తో శుభ్రం చేసారు. పౌరుల భద్రత కోసం ఆమె చేపట్టిన పని ఆదర్శప్రాయమైనది" అని దేశముఖ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె నెటిజెన్ల ప్రశంసలను అందుకుంటోంది. మరిన్ని వార్తలు చదవండి 

Calling it a 'socially conscious initiative', #Maharashtra Home Min @AnilDeshmukhNCP hails the effort of a @PuneCityPolice woman traffic cop who removed shattered glass pieces from the road herself.@CPPuneCity pic.twitter.com/EvvxtXloW8

— Zee News English (@ZeeNewsEnglish) January 20, 2021

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox