Breaking News

కోవిడ్-19 మహమ్మారిపై భారత్ పోరాటం భేష్ :డబ్ల్యూహెచ్ఓ

04 th Jul 2020, UTC

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు అందుకుంది. ఈ మహమ్మారికి సంబంధించిన యావత్తు సమాచారాన్ని సేకరించి, నిర్వహించాలని డబ్ల్యూహెచ్ఓ సలహా ఇచ్చింది.

భారత దేశానికి అతి పెద్ద సవాలు జనాభాయేనని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. భౌగోళిక వైవిద్ధ్యంతోపాటు ప్రతి రాష్ట్రంలోనూ అనేక మహమ్మారులు ఉన్నాయని పేర్కొంది. రోగ నిర్థరణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, అష్ట దిగ్బంధనం విధించడం, అష్ట దిగ్డంధనంలో సడలింపులు విధించడం వంటివి సిస్టమాటిక్ గా జరుగుతున్నాయంది.

 వీటిపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వ బలమైన నాయకత్వం ప్రశంసనీయమైనదని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి తదుపరి దశను భారత దేశంతోపాటు చాలా ఇతర దేశాలు ఎదుర్కొంటున్నాయని, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి సారించాలని తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ, భారత దేశం ప్రారంభం నుంచి చాలా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోందన్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫారసుల మేరకు జనవరి నుంచే కొన్ని చర్యలను అమలు చేసిందన్నారు.

 ప్రస్తుతం దేశంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత రెండు నెలల్లో టెస్టింగ్ కిట్ల విషయంలో భారత దేశం స్వయంసమృద్ధమైందని తెలిపారు. ఇది గొప్ప విజయమని తెలిపారు. భవిష్యత్తులో ఈ టెస్టింగ్ కిట్ల సంఖ్యను పెంచే సామర్థ్యం భారత దేశానికి ఉందని చెప్పారు.

అయితే డేటాపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉందని డాక్టర్ సౌమ్య చెప్పారు. డేటాను పద్ధతి ప్రకారం పరిశీలించవలసి ఉంటుందని పేర్కొన్నారు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చెప్పడం వల్ల కొన్ని వివరాలు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. డేటాను ఏ విధంగా రిపోర్టు చేయాలనేదానిపై జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు ఉండాలన్నారు. ఈ విధానం లేకపోతే వివిధ అంశాలను పోల్చి చూడటం సాధ్యం కాదని చెప్పారు.కోవిడ్-19పై మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల పట్ల కూడా భారత దేశం శ్రద్ధ చూపాలన్నారు. క్షయ వ్యాధి, సంస్థాగత ప్రసవాలు, ఎంపిక చేసుకున్న శస్త్ర చికిత్సలు వంటివి కోవిడ్ కన్నా తీవ్రమైనవని పేర్కొన్నారు. వీటిపై కూడా భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox