కోలీవుడ్ :షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న "మాస్టర్" సినిమా థియేటర్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే, తొలుత ఓటిటి లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఈ సినిమా విడుదల వాయిదా వేసి థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూసారు. తాజాగా, థియేటర్లకు అనుమతి రావడంతో, ఈ నెల పదమూడున ఈ సినిమా విడుదల చేయాలని భావించారు.
రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, ఒకరోజు ముందే ఈ సినిమా లీక్ అయింది. "మాస్టర్" ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో కనిపించడంతో దర్శక నిర్మాతలు ఖంగు తిన్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ, అకస్మాత్తుగా ఈ చిత్రం విడుదల అవడంతో చిత్ర యూనిట్ సభ్యులు షాక్ లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవడం, వాట్సాప్ లో స్టేటస్ లు పెడుతుండడంతో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది.
ఈ సినిమా యూనిట్ కు జరిగిన నష్టం పై ఈ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. "దాదాపు ఏడాదిన్నర కాలం పాటు కష్టపడి ఈ సినిమాను రూపొందించామని, దయ చేసి ఈ సినిమాను థియేటర్ లోనే చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మీ వద్దకు లీక్ అయినా వీడియోలు వస్తే, వాటిని షేర్ చేయవద్దని, ఇంకా ఒక్క రోజులోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
17 Jan 2021
20 Jan 2021
20 Jan 2021