Breaking News

టోక్యో పారా ఒలింపిక్స్.. 12 కు చేరిన భారత్ పతకాల సంఖ్య

03 rd Sep 2021, UTC

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం​ చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్‌ కూమార్‌ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్‌ కూమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

మరోవైపు మహిళా షూటర్‌ అవని లేఖారా 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌(SH1) విభాగంలో కాంస్య పతకం సాధించడంతో భారత పతకాల సంఖ్య 12కు చేరింది. అంతకుముందు అవని  10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

తాజాగా సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా  అవని చరిత్ర సృష్టించింది.  దీనితో జోగిందర్‌ సింగ్‌ బేడీ, మరియప్పన్‌ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా  అవని రికార్డుల కెక్కింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox