Breaking News

నేడు సుశాంత్ బర్త్ డే.. గత జ్ఞాపకాల్లో బాలీవుడ్ నటులు..!

21 st Jan 2021, UTC

బాలీవుడ్ :నేడు సుశాంత్ మొదటి జయంతి. జనవరి 21న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 35వ పుట్టిన రోజు. సుశాంత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా,ఆయన జ్ఞాపకాలు మాత్రం బాలీవుడ్ నటులను, ఆయన అభిమానులను హత్తుకునే ఉన్నాయి. నేడు సుశాంత్ జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సుశాంత్ అభిమానులు ఉద్వేగంతో ఆయన ఫోటోలను షేర్ చేస్తున్నారు. 

సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ సోషల్ మీడియాలో సుశాంత్ ను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసింది. "లవ్‌ యూ భాయ్‌. మీరు మా జీవితంలో భాగం. నిన్ను ఎప్పటికి మర్చిపోలేము" అంటూ ఫోటోను షేర్ చేసింది. పలువురు అభిమానులు స్పందింస్తున్నారు. లెజెండ్స్ కు మరణం ఉండదంటూ పేర్కొన్నారు. సుశాంత్ ఎప్పటికి మన గుండెల్లో బ్రతికే ఉంటారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సుశాంత్ అభిమానులంతా కలిసి "వన్‌ డే టూ ఎస్‌ఎస్‌ఆర్‌ బర్త్‌డే", "సుశాంత్ డే" అనే హాష్ టాగ్ లను వైరల్ చేస్తున్నారు.

గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియానే కారణం అంటూ పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె డ్రగ్స్ కేసులో బెయిల్ తీసుకుని జైలు నుంచి విడుదల అయింది. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox