Breaking News

హాంకాంగ్ నుంచి వైదొలగుతున్నాం:టిక్ టాక్

07 th Jul 2020, UTC
హాంకాంగ్  నుంచి వైదొలగుతున్నాం:టిక్ టాక్

భారత్ నుంచి అనుకోకుండా నిష్క్రమించిన టిక్‌టాక్ హాంకాంగ్  నుంచి  కూడ వైదొల‌గ‌నున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.  హాంకాంగ్ స్వ‌యంప్ర‌తిప‌త్తిని కాల‌రాస్తూ చైనా పార్ల‌మెంటు ఇటీవ‌లే జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టానికి ఆమోదం తెలిపడంతో అక్క‌డ నిరస‌న‌లు భ‌గ్గుమ‌న్నాయి. సోష‌ల్ మీడియాలో నెటిజన్లు చైనా పై  తమ  వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు.

దీనితో చైనా ప్ర‌భుత్వం హాంకాంగ్‌లో నిర‌స‌న‌ల‌ను అణిచివేసేంచుకు టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహ‌కుల‌తోనూ అక్క‌డి ప్ర‌భుత్వ అధికారులు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ త‌న‌ కార్య‌క‌లాపాల‌ను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

అయితే ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యానికొచ్చిన‌ట్లు వివ‌రించింది.దీనివలన టిక్ టాక్ 1,50,000 మంది యూజ‌ర్ల‌ను కోల్పోతుందని తెలుస్తోంది.భారత్ లో టిక్ టాక్ ను నిషేధించడం వలన  6 బిలియ‌న్ డాల‌ర్ల ‌న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచనా.

 1997లో బ్రిటన్‌ నుంచి హాంకాంగ్‌ చైనా చేతికి వచ్చాక.. ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. అయితే హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తి రద్దయ్యేలా చైనా  తాజాగా జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేయనున్న నేపథ్యంలో మరోసారి నిరసనలు వ్యక్తమవుతున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox