Breaking News

సీబీఐ విచారణ కోరిన రియా చక్రవర్తి..!

16 th Jul 2020, UTC
సీబీఐ విచారణ కోరిన రియా చక్రవర్తి..!
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన మృతి పై అనేక అనుమానాలున్నాయి.. అయితే.. ఆయన మృతి పై  పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు.. తాజాగా..  సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి ఈ కేసుపై అత్యున్నత దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని అమిత్ షా ని కోరారు.
 
          సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని  కోరుతూ ఆమె భారత హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ను టాగ్ చేస్తూ బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. ఆమె తన ట్వీట్ లో "సుశాంత్  మన మధ్య నుంచి వెళ్ళిపోయి నెల రోజులు  దాటింది.. నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది..న్యాయాన్ని నిలబెట్టేందుకు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా" అని పేర్కొంది. సుశాంత్‌ ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని..సత్యమేవ జయతే  అంటూ ఆమె పోస్ట్ చేశారు.
 
         ఇది ఇలా ఉంటె.. మరో వైపు సుశాంత్ మరణానికి రియా కూడా కారణమంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ కి ముందు ఆమె ఓ పోస్ట్ చేసారు. "న‌న్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, స‌హించాను.. హంత‌కురాల‌ని నిందించారు.. భ‌రించాను, సిగ్గు లేద‌ని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని, లేక‌పోతే అత్యాచారం చేసి చంపేస్తాన‌ని బెదిరించే హ‌క్కు మీకెక్కడిది? " అని ప్రశ్నిస్తూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. ఆమె ఆ నెటిజెన్ చేసిన బెదిరింపు ని కూడా స్క్రీంషాట్ తీసి షేర్ చేసారు. అసలు సుశాంత్ చావు కు రియా కూడా ఓ కారణమంటూ పలువురు నెటిజెన్ల మండిపడుతున్నారు.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox