Breaking News

వేటూరి గారు కలం పట్టాలి..బాలుగారు గొంతు విప్పాలి..బాలుగారి తీరని కోరిక..!

26 th Sep 2020, UTC

బహుముఖ ప్రజ్ఞాశాలి. నేపధ్య గాయకుడూ బాల సుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆయనను తలుచుకుంటూ, పలువురు ప్రముఖులు తమకు ఉన్న అనుభూతులను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీరంగం శ్రీరమణ కూడా బాలుగారి చివరి కోరిక గురించి తెలిపారు. బాలుగారు ఎన్నో కోరికలు తీర్చుకున్నా ఒకటి మాత్రం అలానే ఉండిపోయిందన్నారు.

శరద్ రుతువులో గోదావరి నదిపై పున్నమి వెన్నెల్లో బోటు విహారం చేయాలని బాలుగారు కోరుకునేవారన్నారు. పాపికొండల ప్రాంతం నుంచి గోదావరిలో శబరి నది కలిసేవరకు మూడు లాంచీలు, ఆరు పంట్లు (ప్లాట్ ఫాం వంటి నిర్మాణం) కట్టుకుని వాటిపై పాటలు పాడుకుంటూ వెళ్లాలని బాలుగారి కోరిక ఆయనతో పాటు బాపు-రమణ, వేటూరి, ఏఆర్ రహమాన్, డ్రమ్స్ శివమణి, ఫ్లూట్ ఆర్టిస్ట్ గుణ ఉండాలని ఆయన అనుకునే వారు. వేటూరి గారు అప్పటికప్పుడు పాటలు రాస్తే వాటిని పాడాలని బాలు గారి చిరకాల వాంఛ. కానీ అది తీరలేదు. తీర్చడానికి వేటూరి గారూ లేరు. "బాలు గారూ! ఒక్కసారి రావొచ్చు కదా. మన గోదావరి యాత్ర పండిచుకుందాం! " అంటూ శ్రీరంగం శ్రీ రమణ ఎమోషనల్ అయ్యారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox