Breaking News

వలసకార్మికులకు 3 లక్షల ఉద్యోగాలు..బర్త్ డే సందర్బంగా సోనూసూద్ ప్రకటన

31 st Jul 2020, UTC

ముంబై : కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందిస్తున్న రియల్‌ హీరో నటుడు సోనూసూద్‌. జూలై 30న తన పుట్టిన రోజు సందర్భంగా వలస కార్మికులను ఆదుకునేందుకు మరో అడుగు ముందుకేసాడు. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదిన కానుకగా 3లక్షల ఉద్యోగాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 

నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్‌గర్‌.కామ్‌లో 3లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి అంటూ ట్వీట్ సోనూ‌ చేశాడు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో వలస జీవులను తన సొంతఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి గ్రామాలకు చేర్చిన సోనూసూద్ ఈ విషయంలో తనకు మద్దతుగా వచ్చిన పలు సం‍స్థలు ధన్యవాదాలు తెలిపాడు. 

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడ  సోనూసూద్‌ ఆ తర్వాత కూడా నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పేద రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతన్న మీడియోకు చలించిన ఆయన ఏకంగా ట్రాక్టర్‌ను కొని పంపించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడి చికిత్సకు డబ్బు సాయం చేశాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శారదకు ఉద్యోగం కూడా ఇప్పించాడు.

ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తూ సోనూసూద్‌ అందరి మన్ననలు పొందున్నాడు. ఇతడు రీల్ లైఫ్ లో విలన్ అయినా రియల్  లైఫ్ లో హీరో అంటూ పలువరురు కొనియాడుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox