Breaking News

400 కుటుంబాలకు సోనూ సూద్ చేయూత..!

13 th Jul 2020, UTC
400 కుటుంబాలకు సోనూ సూద్  చేయూత..!
కరోనా సమయంలో వలస కార్మికులకోసం బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సాయం ఎవరూ అందరికీ తెలిసిందే.వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరిని వారి గూటికి చేర్చడంపై సోనూ సూద్ చేసిన సేవకు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.

 అంతేకాదు.. వైద్యులు, వారి సిబ్బంది  కోసం తన హోటల్ కేటాయించి వాడుకోమన్నాడు.అయితే ఇప్పటికీ తన తన బాధ్యత ఇంకా పూర్తి కాలేదంటున్నారు సోనూ సూద్‌. లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్.

ప్రభుత్వాలు, అధికారులే మొక్కుబడిగా వ్యవహరిస్తున్న ఈ సమయంలో సోనూ సూద్ వలస కార్మికుల కోసం చిత్త శుద్దితో పాటుపడటం నిజంగా అభినందనీయమని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox