Breaking News

సిమ్ కార్డ్ పై సోనూ సూద్ చిత్రాన్ని పెయింట్ చేసిన అభిమాని

08 th Oct 2021, UTC

బాలీవుడ్ నటుడు సోనూసూద్  కోవిడ్ -19 సంక్షోభం నేపధ్యంలో ప్రజలకు చేసిన సేవలతో రియల్ హీరోగా మారారు. ప్రజలు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి రవాణా ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన వస్తువులను కూడా సరఫరా చేసారుఆక్సిజన్ సిలిండర్లను,మందులను ఏర్పాటు చేశారు. 

సంక్షోభ సమయాల్లో  అతని సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్‌లు మరియు వాట్సాప్ నంబర్‌లు సహాయం కోసం అభ్యర్థనలతో నిండిపోయాయి.ఇటీవల సోనూ సూద్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు.  అతని  మైక్రోసాఫ్ట్  ఇమెయిల్ యొక్క స్క్రీన్ షాట్ 52,348 చదవని ఇ మెయిల్స్ చూపించింది. ఈ వారం, ట్విట్టర్‌లో సోమిన్ అనే పేరుతో వెళ్తున్న ఒక నెటిజన్, సిమ్ కార్డ్‌లో నటుడి పోర్ట్రెయిట్ పెయింట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. . యూజర్ తన ట్వీట్‌లో సోను సూద్‌ను ట్యాగ్ చేసి సిమ్ కార్డ్ యొక్క ఫోటోను  షేర్ చేసారు. సోనూ సూద్ ఈ ట్వీట్‌కు  ఇలా రిప్లై ఇచ్చారు.ఉచిత 10 జి  నెట్‌వర్క్. సోనూ సూద్ ఇచ్చిన  రిప్లై   7,000 లైక్‌లు మరియు వందలాది  కామెంట్లు సంపాదించింది.

ఆగస్టులో, పర్వతారోహకుడు ఉమా సింగ్ ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని సైకిల్‌పై అధిరోహించారు మరియు ఈ ఘనతను సోనూ సూద్‌కు అంకితం చేశారు.ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతనుఆఫ్రికాలోని ఎత్తైన ప్రదేశంలో నిలబడి తన చేతుల్లో సోనూసూద్ పోస్టర్‌ను పట్టుకుని అతనికి  కృతజ్ఞతలు చెప్పాడు.

తాజాగా ఖమ్మం జిల్లాలోని  బోనకల్ జోన్ లోని గార్లపడ అనే గ్రామంలో కూడా సోనూసూద్ కు ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ అనే అభిమాని తన ఇంటి ఆవరణలో ఈ చిన్న గుడిని నిర్మించారు. అందులో సోనూసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు  చేశారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox