Breaking News

సుశాంత్ కు ఆ పరమ శివుడే న్యాయం చేస్తాడు...

07 th Aug 2020, UTC

 ముంబై :బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజర‌య్యింది. ఈ నేప‌థ్యంలో సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ ఇన్‌స్టా వేదిక‌గా ఓ పోస్టును  పంచుకుంది. ''మీరు ఎవరి జోలికైనా వెళ్లేముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వారిని ఎవరు రక్షిస్తున్నారో మీకు తెలీదు అంటూ ఓ శివుడి ఫొటోను శ్వేతా పోస్ట్ చేస్తూ  ‘హర హర మహాదేవ’ అంటూ ఓ క్యాప్ష‌న్‌ను జోడించారు. ఈ పోస్ట్‌కు అంకితా కూడా స్పందించింది. సుశాంత్ దేవుడి బిడ్డ‌ని, ఆ ప‌ర‌మ‌శివుడే న్యాయం చేస్తాడంటూ నెటిజ‌న్లు పోస్ట్ చేస్తున్నారు. 
 
 బుధ‌వారం సుశాంత్ కేసును సీబీఐకి బ‌దిలీ చేశాక శ్వేతా త‌న ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌ను మార్చింది. సుశాంత్ ముఖం స‌గ‌భాగం, మిగ‌తాది శివుడి ముఖంతో ఉంది. జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్, హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ ,జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ అంటూ ఓ క్యాప్ష‌న్‌ను జ‌త‌చేసింది. సుశాంత్  కూడా శివుడి భ‌క్తుడ‌ని స‌న్నిహితులు తెలిపారు. అంతేకాకుండా చారిత్రక రామ‌మందిరం ఆల‌య శంకుస్థాప‌న జ‌రిగిన రోజే సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డం ప‌ట్ల ఆయ‌న కుటుంస‌భ్యులు, ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకా నిజాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంద‌ని అంకితా సైతం పోస్ట్ చేశారు.సుశాంత్ కేసు విచార‌ణ మొద‌లైనప్ప‌టి నుంచి  అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియా చ‌క్ర‌వ‌ర్తి ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ముంబైలోని ఈడీ ఎదుట హాజ‌రైంది. మరిన్ని వార్తలు చడదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox