Breaking News

ట్వట్టర్ ట్రెండింగ్ లో # షేమ్ ఆన్ విజయ్ సేతుపతి 

14 th Oct 2020, UTC

కోలీవుడ్ :మురళీధరన్ బయోపిక్ 800 పేరుతో మంగళవారం (అక్టోబర్ 13) మోషన్ పోస్టర్‌ ప్రకటించిన వెంటనే # విజయ్ సేతుపతి అనే హ్యాష్‌ట్యాగ్ ఉదయం నుండి ట్రెండింగ్‌లో ఉంది. శ్రీలంక దిగ్గజ స్నిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు దీనిపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

తమిళులను ఊచకోతకోసిన దేశానికి చెందిన వ్యక్తి పాత్ర పోషించడం పట్ల వారు విజయ్ సేతుపతి పై మండిపడుతున్నారు.సోషల్ మీడియాలో దీనిపై వారు తమ కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సేతుపతి నీకసలు వెన్నుముక వుందా అని ఒకరు ప్రశ్నించారు. తమిళుల రక్తంతో తడిసిన జెండాను నీ గుండలపై మోస్తావా అని మరొకరు కామెంట్ చేసారు.వేలాది మంది తమిళులను హతమార్చడానికి మరియు దేశంలో మైనారిటీలుగా వ్యవహరించడానికి శ్రీలంక ప్రభుత్వం కారణమని చాలా మంది  తమిళులు అభిప్రాయపడ్డారు. దర్శకుడు సీను రామసామి కూడా ఈ చిత్రం చేయాలనే తన నిర్ణయాన్ని పున పరిశీలించాలని విజయ్ సేతుపతిని అభ్యర్థించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox