Breaking News

ప్రపంచానికి రష్యా గుడ్‌న్యూస్..

31 st Jul 2020, UTC
ప్రపంచానికి రష్యా గుడ్‌న్యూస్..

మాస్కో : కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రపంచానికి రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకా ను ఆగస్టులో తీసుకురానున్నట్లు తెలిపింది. అయితేవ్యాక్సిన్‌ను తీసుకురావాలన్న తొందరలో రష్యా సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తుండడం గమనార్హం.

చైనాలోని వూహాన్‌లో పుట్టి మమమ్మారిలా మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తోంది. ఇకకరోనా వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే అనేక దేశాలు రేసులో పరిగెడుతున్నాయి. అయితే వీటిలో ఏ దేశం ముందుగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తుందో తెలియక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

అయితే ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా చెబుతోంది. రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌స్టిట్యూట్‌, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ టీకాను రూపొందిస్తున్నాయి. డ్రగ్ రెగ్యూలేటర్ల నుంచి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కోవిడ్19వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’ ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్‌ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అక్కడి అధికార మీడియా ప్రకటించింది.

రష్యాలోనే మరో టీకాకు మానవ ప్రయోగాల దశ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. జూలై 27న ఐదుగురు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారని, వారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్‌ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది. అయితే టీకాను విడుదల చేయాలన్న తొందరలో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. కోవిడ్19వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి ఫలితాలను విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రష్యా టీకాకు రెండో దశ ట్రయల్స్‌ కూడా పూర్తి కాలేదని, ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ప్రయోగాలు దీనికన్నా ముందంజలో ఉన్నాయని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అయితే, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని రష్యా అంటోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించి టీకాను తయారు చేస్తున్నామని రష్యా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox